న్యాల్‌కల్‌లో గణేష్ మండపంలో ఘనంగా కుంకుమ అర్చన

న్యాల్‌కల్ మండల కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో శ్రీ రామలింగేశ్వర మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో సోమవారం కుంకుమ అర్చన పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. లోకకల్యాణం, గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి కోసం కుంకుమ అర్చన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕