సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాయికోడ్ లో మండల శాఖ అధ్యక్షులు యాదవులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సంఘం చేస్తున్నటువంటి కృషిని తెలియజేసి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిలు సల్మా, శ్రావణి, తులసి, శోభ పాల్గొన్నారు.