కోహిర్ మండలం గురుజువాడ గ్రామంలో 'స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు చెత్తను నిర్దేశించిన ప్రదేశాల్లోనే వేయాలని సర్పంచ్ ప్రియాంక రాజేందర్ సూచించారు. పరిశుభ్రతే ఆరోగ్యమని తెలిపారు.