సర్పంచ్ అమరేశ్వరి దాతృత్వం: జీర్లపల్లిలో తాగునీటి బోరు ఏర్పాటు

ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణి తన దాతృత్వంతో గ్రామస్తుల తాగునీటి సమస్యను తీర్చారు. సొంత నిధులతో బోరు వేయించి, పుష్కలంగా నీరు లభించేలా చేశారు. అనతి కాలంలోనే తమ సమస్యను పరిష్కరించిన సర్పంచ్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజశేఖర్, నాయకులు వెంకట్ రెడ్డి, మధు సుదన్ రెడ్డి, అనీఫ్, జాకీర్, బిచయ్య, నవీన్, భరత్, రాజు, ఆశీర్వాదం, యేసు, సురేందర్, వసంత్, రహిమొద్దీన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్