ఝరాసంగం మండలం మచ్నూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మార్పల్లి కృష్ణ (42) ఆదివారం ఉదయం మృతి చెందారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ బీఆర్ఎస్ బలోపేతానికి ఆయన కృషి చేశారు. కృష్ణ మృతితో మచ్నూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.