జహీరాబాద్‌లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

జహీరాబాద్ – నారింజ బ్రిడ్జ్‌ వద్ద శుక్రవారం వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. బారికేడింగ్, లైఫ్‌ జాకెట్లు, లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్‌ మళ్లింపులు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ డీఎస్పీ సైదా నాయక్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕