వర్షానికి నేలకొరిగిన చెరుకు పంట

ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున్ పాటిల్ సుమారు 5 ఎకరాల్లో సాగు చేసిన చెరుకు పంట శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పూర్తిగా నేలకొరిగింది. దీంతో పంట తీవ్రంగా దెబ్బతిని, రైతుకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక పంట సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, ఈ ఆకస్మిక వర్షం మరింత నష్టాన్ని కలిగించింది. ప్రభుత్వం తమ నష్టాన్ని పరిశీలించి, తగిన పరిహారం అందించాలని రైతు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕