ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికుల ఆందోళన

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామ శివారులోని ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికులు గురువారం పరిశ్రమ గేటు ముందు ఆందోళన చేపట్టారు. పెండింగ్ బకాయిలు చెల్లించి, తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్