జహీరాబాద్: బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర

మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం, సంకటహర చతుర్థి సందర్భంగా బీఆర్ఎస్ నేత నామ రవి కిరణ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ లోని భవాని మందిరం నుంచి న్యాల్కల్ మండలం రేజింతల్ స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయం వరకు బుధవారం పాదయాత్ర నిర్వహించారు. రేజింతల్ వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమం ద్వారా నాయకులు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ పాదయాత్రలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్