జహీరాబాద్ డెవలప్మెంట్ కోసం కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తోందని బీజేపీ నేత అప్పం శ్రావణ్ కుమార్ అన్నారు. వాటిని సకాలంలో పొంది సద్వినియోగం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయమై శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నారని తెలిపారు.