జహీరాబాద్ లో వెలసిన ఉరడమ్మ దేవాలయంలో ఆషాడ మాస వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని కూరగాయలతో ప్రత్యేకంగా శాకంబరీ రూపంలో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ పాల్గొన్నారు.