అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను http://telangana.epss.gov.in లో ఆగస్టు 31వ తేదీ వరకు చేసుకోవాలని చెప్పారు. అర్హులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.