జహీరాబాద్: ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మాజీ సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులకు నిరసనగా, ఆదివారం జహీరాబాద్ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే మాణిక్యరావు ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ఈ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాణిక్యరావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు మానుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్