జరా సంఘం: ఎన్నికల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. శనివారం జరా సంఘంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, 14వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయని, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్