టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ గొప్ప మనసు చాటుకున్నాడు. తన అభిమానికి రూ. 40,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజూ.. తదుపరి మ్యాచ్‌కు గ్యాప్ రావడంతో తిరువనంతపురం వెళ్లాడు. అక్కడ ఫోన్ మాట్లాడటానికి కారు ఆపినప్పుడు, ఓ కేబుల్ టెక్నీషియన్ శబరీష్‌ను కలిశాడు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో శబరీష్ పగిలిపోయిన ఫోన్‌ను చూసిన సంజూ తన వద్దనున్న విలువైన స్మార్ట్‌ఫోన్‌ను అతనికి బహుమతిగా ఇచ్చాడు.