సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్‌లో భారీ రద్దీ నెలకొంది. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, తార్నాక వంటి ప్రధాన కూడళ్లలోనూ రద్దీ కనిపించింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సంక్రాంతి సందర్భంగా నగర వాసులు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు బయల్దేరడంతో బస్టాండ్లు, రైళ్లలో ప్రయాణికుల సందడి కొనసాగుతోంది.