సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఛైర్‌కార్‌, జనరల్‌ బోగీలతో ఈ రైళ్లు పండగకు ముందు, తర్వాతి రోజుల్లో రాకపోకలు సాగిస్తాయి. జనవరి 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10కు హైదరాబాద్ నుంచి విజయవాడకు, 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40కు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. రిజర్వేషన్‌ లేని ప్రయాణికుల కోసం ఎక్కువగా జనరల్‌ బోగీలు కూడా ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్