ఓటుకు రూ.2000.. సెల్ టవర్ ఎక్కి సర్పంచ్ అభ్యర్థి నిరసన(వీడియో)

TG: ప్రత్యర్థులు తనను ఓడించేందుకుగాను ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఓ సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తనని ఓడించేందుకు ప్రత్యర్థి.. ఒక్కో ఓటుకు రూ.2000 పంచుతున్నారని నర్సంపల్లి పెద్ద తండా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న శంకర్ నాయక్ ఆరోపించారు. అధికారులు చర్యల తీసుకోవాలని కోరాడు. గతంలో కూడా తాను సర్పంచిగా పోటీ చేసి ఓడిపోయానని ఆవేదన వెల్లబోసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.

సంబంధిత పోస్ట్