ఎర్రవల్లిలో సర్పంచ్ ఎన్నికలు బహిష్కరణ

TG: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామ ప్రజలు, తమ గ్రామంలో నిర్మించ తలపెట్టిన డిండి నార్లాపూర్ ఎత్తిపోతల పథకం జలాశయ నిర్మాణ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. అధికారులు ఈ నెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. ఇవాళ సాయంత్రం వరకు గ్రామ పంచాయితీకి చెందిన ఏ ఒక్కరూ నామినేషన్లు వేయకుండా ఎన్నికలు బహిష్కరించారు.

సంబంధిత పోస్ట్