సర్పంచ్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్

TG: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని సింగరేణి పంచాయతీలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సమావేశమై కాంగ్రెస్ అభ్యర్థి పోలగాని శ్రీనివాస్ గౌడ్‌కు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి షేక్ గౌసుద్దీన్ పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఇరుపక్షాలు ఏకాభిప్రాయంతో మదన్ లాల్ సానుభూతిపరులు, బీఆర్ఎస్ శ్రేణులు స్పానర్ గుర్తుపై ఓటు వేసి శ్రీనివాస్ గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని తీర్మానించాయి.

సంబంధిత పోస్ట్