సర్పంచ్ ఎన్నికలు.. తల్లిపై పోటీకి దిగిన కూతురు

తెలంగాణలో స్థానిక ఎన్నికల వేళ పల్లెల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఏకంగా తల్లిపై కూతురు పోటీకి దిగింది. జగిత్యాల(D) తిమ్మయ్య పల్లెలో సర్పంచ్ స్థానం BC మహిళకు రిజర్వ్ కాగా BRS మద్దతుతో శివరాత్రి గంగవ్వ బరిలోకి దిగారు. ఆమె కూతురు సుమలతను అధికార కాంగ్రెస్ బలపరిచింది. అయితే సుమలత గతంలో గ్రామ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య వైరం నడుస్తోంది. తల్లీకూతుళ్లు బరిలో దిగడంతో పోరు రసవత్తరంగా మారింది.

సంబంధిత పోస్ట్