TG: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో సర్పంచ్ అభ్యర్థులు శ్రీరామ్, నాగలక్ష్మి కోతుల బెడదను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ వినూత్న ప్రచారం చేపట్టారు. తమ అనుచరులతో ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ చేయించి కోతులను తరిమికొట్టారు. తమను గెలిపిస్తే కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అభ్యర్థులు ఓటర్లకు తెలిపారు. గ్రామంలో 1537 మంది ఓటర్లు ఉండగా, ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనుంది.