TG: కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ సర్పంచ్ భర్త మధు బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామసభలో నారాయణపూర్ జలాశయ ముంపు అంశం, అభివృద్ధి పనులపై తీర్మానం విషయంలో కొందరు కులవివక్షతో కూడిన వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన మధు మోతాదుకు మించి మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సర్పంచ్ బాబా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 13 మందిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు.