కొత్త పార్టీ ప్రకటించిన శశికళ

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త పార్టీని ప్రకటించారు. జయలలిత, అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ ఫొటోలతో కూడిన ఎరుపు, తెలుపు, నలుపు రంగుల జెండాను ఆమె ఆవిష్కరించారు. త్వరలోనే పార్టీ పేరును వెల్లడిస్తానని, తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తానని శశికళ స్పష్టం చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

సంబంధిత పోస్ట్