ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి అమ్ముడయ్యే ఫోన్లలో దాదాపు 46 శాతం శాటిలైట్ కనెక్టివిటీతో ఉంటాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఖరీదైన ఫోన్లలోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నా, అమెజాన్ 'గ్లోబల్‌స్టార్' కొనుగోలుతో విస్తరణ వేగవంతం కానుంది. మొబైల్ టవర్లు లేని ప్రాంతాల్లో అత్యవసర సమాచారం పంపడానికి ఇది ఉపయోగపడుతుంది. అందరికీ అందుబాటులోకి రావాలంటే ఆండ్రాయిడ్ కంపెనీలు, టెలికాం ఆపరేటర్లు కృషి చేయాలని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ రిచర్డ్‌సన్ అన్నారు.