గాజాలో తీవ్ర ఆహార కొరత ప్రజల్ని అల్లాడిపోయేలా చేస్తోంది. ఫుడ్ ట్రక్కులు రావడమే ఆలస్యం.. వచ్చి రాగాలే వాటిని జనాలు చుట్టుముట్టుతూ.. తిండి కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా లక్షలాది మంది ఆకలితో బాధపడుతున్నారు. ఆకలి కేకలతో గాజా ప్రజల పరిస్థితి ప్రపంచాన్ని గజగజలాడేలా చేస్తోంది.