థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్-500 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అద్భుత ప్రదర్శన కనబరిచింది. సెమీఫైనల్లో మలేషియా జోడీ గో జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్పై 19-21, 22-20, 21-16 తేడాతో విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఈ సీజన్లో ఇది వారి తొలి ఫైనల్ కావడం విశేషం. తొలి సెట్ను మలేషియా జోడీ గెలుచుకున్నప్పటికీ, భారత జోడీ అద్భుతంగా పుంజుకుని మిగిలిన రెండు సెట్లను గెలుచుకుని మ్యాచ్ను కైవసం చేసుకుంది.