వాహనదారులకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆసియా దేశాలకు సరఫరా చేసే ముడి చమురు ధరలను సౌదీ అరేబియా గణనీయంగా తగ్గించనున్నట్లు ప్రకటించింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 72 డాలర్ల వద్దకు చేరగా, దిగుమతి వ్యయం తగ్గే అవకాశం ఏర్పడింది. దీంతో భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఖర్చులు తగ్గి, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే తుది నిర్ణయం అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి మారకం విలువ, రవాణా వ్యయాలు, పన్నులు వంటి అంశాల ఆధారంగా తీసుకోనున్నారు.