సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రయాణించగా.. అందులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. షోయబ్ అనే యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏడుగురు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. అలాగే మరో కుటుంబానికి చెందిన ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో మరణించారు.