నవ్వుల వర్షం కురిపించేందుకు సిద్ధమైన 'సేవ్ ది టైగర్స్-3'

మగాళ్ల బాధలను హాస్యభరితంగా చూపించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్  సిరీస్ మూడో సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు ఘన విజయం సాధించాయి. తాజాగా విడుదలైన సేవ్ ది టైగర్స్-3 ట్రైలర్ నవ్వులు పూయిస్తోంది. అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ సిరీస్ జూన్ 19 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి వంటి పలువురు కీలక పాత్రల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్