పెట్రోల్, డీజిల్ ఆదా: ఇంజిన్ ఆపితే ఖర్చు తగ్గుతుందా?

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్ ఆపితే ఇంధనం ఆదా అవుతుందా అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే, 30-60 సెకన్ల కంటే ఎక్కువసేపు బండి ఐడ్లింగ్‌లో ఉన్నప్పుడు, ఇంజిన్ తిరిగి స్టార్ట్ చేయడానికి అయ్యే ఇంధనం కంటే ఐడ్లింగ్‌లో ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. కాబట్టి, రెడ్ సిగ్నల్ సమయం నిమిషం కంటే ఎక్కువ ఉంటే ఇంజిన్ ఆపితే ఇంధనం ఆదా అవుతుంది. కొత్త వాహనాల్లో ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్స్ ఈ విషయంలో సహాయపడతాయి. డీజిల్ వాహనాలు మాత్రం రీస్టార్ట్ వల్ల బ్యాటరీ, మోటార్లపై ఒత్తిడి పడుతుంది, ఎక్కువసేపు రెడ్ సిగ్నల్ ఉంటే తప్ప ఇంజిన్ ఆఫ్ చేయకపోవడమే మంచిది.

సంబంధిత పోస్ట్