ఫోర్బ్స్ విడుదల చేసిన భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాలో ఓపీ జిందాల్ గ్రూపు ఓనర్ సావిత్రి జిందాల్ మరోసారి దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. 40 బిలియన్ డాలర్ల సంపదతో ఆమె టాప్ 10 బిలియనీర్లలో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తర్వాత ఆమె మూడో స్థానంలో ఉన్నారు. స్టీల్, పవర్, సిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో జిందాల్ గ్రూపు వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి. ఆమె హర్యానాలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.