ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నకిలీ మెసేజ్‌లు వస్తే ఏం చేయాలంటే?

ఎస్‌బీఐ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక హెచ్చరిక జారీ చేసింది. సైబర్ మోసగాళ్లు బ్యాంకు అధికారులు, కంపెనీ సీఈఓల పేర్లతో నకిలీ మెసేజ్‌లు పంపుతూ డబ్బులు, వ్యక్తిగత వివరాలు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. అత్యవసరమని భయపెట్టి ఓటీపీలు, బ్యాంక్ వివరాలు అడిగితే వెంటనే స్పందించవద్దని సూచించింది. అనుమానాస్పద కాల్స్, లింకులను నమ్మకూడదని, ముందుగా అధికారికంగా ధృవీకరించుకోవాలని తెలిపింది. మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ఎస్‌బీఐ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్