mCASH సేవలపై SBI కీలక ప్రకటన

ఆన్‌లైన్, యోనో లైట్ ద్వారా డబ్బును పంపే, క్లెయిమ్ చేసే mCASH సేవలను ఈ నెల 30 తర్వాత నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. UPI, IMPS, NEFT, RTGS తదితర డిజిటల్ పేమెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. కాగా లబ్ధిదారుడిని ముందుగా రిజిస్టర్ చేయకుండానే మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బు లావాదేవీలు చేయడం కోసం mCASH సేవలను ఎస్బీఐ గతంలో వినియోగంలోకి తెచ్చింది.

సంబంధిత పోస్ట్