ఎస్‌బీఐ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) ద్వారా నిధుల సమీకరణ చేపట్టింది. ఒక్కో షేరుకు రూ.811.05 ఫ్లోర్ ప్రైస్‌గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఆఫర్ లేదా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా సుమారు రూ.25వేల కోట్లు సమీకరించేందుకు మే నెలలో ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. షేర్‌హోల్డర్లు కూడా నిధులు సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాజాగా క్యూఐపీ చేపట్టింది.