TG: ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫలితాలను ప్రకటించారు. మొదటి విడతలో మొత్తం 18,401 మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులకు త్వరలోనే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు.