టీ దుకాణాల్లో జరిగే ఒక వ్యాపార ట్రిక్‌ను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో బయటపెట్టింది. రోడ్డు పక్కన టీ దుకాణాల్లో ప్లాస్టిక్ కప్పులో టీ ధర రూ.5 ఉండగా, మట్టి కప్పులో అదే టీ ధర రూ.10కి పెంచి అమ్ముతున్నారని వీడియోలోని వ్యక్తి అన్నారు. మట్టి కప్పులోని టీ పరిమాణం ప్లాస్టిక్ కప్పుకు సరిగ్గా సరిపోయింది. దీనివల్ల టీ నాణ్యతలో, పరిమాణంలో మార్పు లేకపోయినా, కప్పు మారగానే ధర రెట్టింపు అవుతోందని స్పష్టమైంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.