ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియలో ఓటర్ల జాబితాలో మోసాలు జరుగుతున్నాయి. కేటుగాళ్లు బూత్ స్థాయి అధికారి (BLO)గా నటిస్తూ, ఓటర్ల మొబైల్‌కు వచ్చిన OTPని అడుగుతున్నారు. ఒక్క OTPతో బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ECI/BLO ఎవరూ ఫోన్‌లో OTP అడగరని, ఎవరికీ OTP ఇవ్వొద్దని, బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. కాగా, భోపాల్‌లో ఇలాంటి స్కామ్ ఇప్పటికే నమోదైంది.