క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుంది: నిపుణులు

ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్‌ల వాడకం పెరిగింది. అయితే సైబర్ నేరగాళ్లు నకిలీ క్యూఆర్ కోడ్‌లను సృష్టించి, వాటి ద్వారా ప్రజల బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను దొంగిలిస్తున్నారు. సైబర్ నిపుణులు దీనిని 'క్విషింగ్' అని పిలుస్తున్నారు. అసలు క్యూఆర్ కోడ్‌లపై నకిలీ స్టిక్కర్లు అతికించి, వినియోగదారులను మోసపూరిత వెబ్‌సైట్‌లకు మళ్లిస్తున్నారు. స్కాన్ చేసిన వెంటనే లింక్‌పై క్లిక్ చేయకుండా, URLను జాగ్రత్తగా తనిఖీ చేయాలని, పాస్‌వర్డ్, OTP, కార్డ్ వివరాలు అడిగితే ఆపాలని, బహిరంగ ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్‌లను గమనించాలని, ఫోన్‌లోని డిఫాల్ట్ కెమెరా యాప్‌ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్