యూపీలోని గాజియాబాద్, ప్రతాప్ విహార్లోని డిఏవి పాఠశాలకు నలుగురు విద్యార్థులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ వ్యాన్ గురువారం ఉదయం సేన్ చౌక్ వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 13-14 ఏళ్ల వయస్సు గల నలుగురు విద్యార్థులు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో తలిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి పిల్లలను వ్యాన్ నుండి బయటకు తీశారు. ఘటనపై పోలీసులు డ్రైవర్ను విచారిస్తున్నారు