కూలిన స్కూల్‌ గేటు.. నలుగురు విద్యార్థులకు గాయాలు

కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా, బాలకుండి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రధాన ద్వారం కూలిపోవడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. గేటు తెరుస్తున్నప్పుడు విద్యార్థులపై పడటంతో ఒక బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మెరుగైన చికిత్స కోసం బాగల్‌కోట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురు విద్యార్థులకు ఇల్కల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది కూడా గేటు కూలిందని, శిథిలావస్థలో ఉన్న గేటును మరమ్మతులు చేయలేదని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్