స్కూల్ బాలికపై యువకుడు అత్యాచారం.. ఆపై ఆటో డ్రైవర్

AP: స్కూల్ బాలికపై ఓ యువకుడితో పాటు ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. గత నెల 29న ఆటో డ్రైవర్ సునీల్ బాలికను స్కూల్‌కు ఆటోలో తీసుకెళ్తుండగా.. సతీష్ బైక్‌తో అనుసరించాడు. దారిలో బాలికకు వాంతి కాగా.. ఆమెను ఇంటికి తీసుకెళ్తానని సతీష్‌ బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో బాలికపై లైంగికదాడి చేశాడు. సాయంత్రం స్కూల్‌కి తీసుకొచ్చి పాఠశాల ఆటోలో ఎక్కించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సునీల్ కూడా బెదిరించి లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్