AP: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలూరు నవోదయ విద్యాలయంలో స్టాఫ్ దారుణంగా ప్రవర్తించారు. హాస్టల్‌లో చికెన్ బిర్యానీ తెచ్చుకుని తిన్నారని 26 మంది విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఆ తరువాత ప్రిన్సిపాల్ పేరెంట్స్‌ని పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ సరిగా అందకపోవడంతోనే పిల్లలు బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల కాళ్లు, చేతులపై కమిలిపోయేలా కొట్టిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.