నేటి నుంచి స్కూల్స్ ఓపెన్

వేసవి సెలవుల అయిపోయాయి. ఇక నుంచి రోజూ బడికి వెళ్లాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గురువారం నుంచి అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు ఉంటాయి. పాఠ్యపుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయి. కొన్ని ప్రైవేట్ బడులు ముందుగానే ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్