తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ల యాజమాన్యాలకు విద్యాశాఖ హెచ్చరికలు చేసింది. విద్యార్థుల ర్యాంకులను ప్రకటిస్తే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. GO145 ప్రకారం 1997-98 నుంచి ర్యాంకులను ప్రకటించడాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, ఏ విద్యాసంస్థ యాజమాన్యం ర్యాంకులను ప్రకటించినా, ప్రకటనలు చేసినా చట్టప్రకారం పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.