ఇంట్లో బల్లులు సర్వసాధారణం. అయితే, బల్లి నేలపై పాకుతూ కనిపిస్తే ఇంట్లో ఎవరైనా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని పండితులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గాలిలోని చెడు వాసనలు, సూక్ష్మజీవులను గుర్తించి, ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు అవి గోడల నుండి నేలపైకి వస్తాయని శాస్త్రీయ దృక్కోణం చెబుతోంది. రెండు బల్లులు ఒకే చోట కనిపిస్తే పాత స్నేహితులను కలిసే సూచన అని, అవి పోట్లాడుకుంటే స్నేహితులకు దూరం అయ్యే అవకాశం ఉందని బల్లి శాస్త్రం చెబుతోంది. ఉదయం బల్లి శబ్దం శుభసూచకం. కలలో బల్లి కనిపిస్తే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని సూచిస్తుంది.