TG: హైదరాబాద్‌లో వేసవి తాపం తీవ్రమవుతోంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 38.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 23కి పడిపోవడంతో పొడి వాతావరణం నెలకొంది. ఆదివారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నా, అది తాత్కాలిక ఉపశమనమేనని భావిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు 38-41 డిగ్రీలకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.