హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ అటల్ టనల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ స్కార్పియో కారు నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను బద్దలు కొడుతూ సిమెంట్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు