స్కార్పియో బోల్తా.. 13 మంది మృతి

ఝార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్‌ జిల్లాలో రాంచీ-పట్నా హైవే (NH-33)పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్లోని నలందా జిల్లాకు చెందిన 14 మంది ప్రయాణిస్తున్న స్కార్పియో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. రామ్‌గఢ్‌లోని ప్రసిద్ధ రాజ్ రప్పా ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్

✕
✕