ఈ ఆలయంలో తేళ్ల విగ్రహాలకు పూజలు.. ఎక్కడో తెలుసా?

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కందుకూరు గ్రామంలో కొండమవ్వ గుట్టపై వెలసిన తేళ్ల విగ్రహాలకు పూజలు చేసే వింత ఆచారం కొనసాగుతోంది. శ్రావణ మాసంలో నాగుల పంచమి రోజున ఈ పూజలు చేస్తారు. ఈ గుట్టపై ఏ రాయిని కదిలించినా తేళ్లు కనిపిస్తాయని, అవి భక్తులను కుట్టవని గ్రామస్థులు చెబుతున్నారు. పంచమి రోజున మాత్రమే ఇవి దర్శనమిస్తాయని, ఒకవేళ కుట్టినా పూజారి పసుపు కుంకుమ పూస్తే నొప్పి తగ్గిపోతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్